WGL: పర్వతగిరి మండలం శ్రీనగర్ రైతు వేదిక వద్ద ఒక లారీ లోడు 444 బస్తాల యూరియా చేరడంతో గురువారం రైతులు రైతు వేదిక వద్ద క్యూలైన్లో నిలబడ్డారు.యూరియా కూపన్లు ఇచ్చే సమయంలో సుమారు 1500 మంది రైతులు రావడంతో అధికారులు కూపన్లు పంపిణీని నిలిపివేశారు. మరో లోడు వచ్చిన తర్వాత రెండు లోడ్లకు కలిపి యూరియా సరఫరా చేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.