SRPT: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో జిల్లా పోలీసు విభాగానికి చెందిన 8 మంది సిబ్బందికి రాష్ట్ర స్థాయి పోలీసు సేవా పతకాలు లభించాయి. కోదాడ, సూర్యాపేట టౌన్, ట్రాఫిక్ ఆర్మ్డ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ గౌరవం దక్కింది. అవార్డు పొందిన సిబ్బందికి జిల్లా ఎస్పీ నరసింహ అభినందనలు తెలిపారు.