E.G: టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా 49 మందిని ఉత్తమ కార్యకర్తలుగా ఎంపిక చేశారు. వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.