NLR: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాళెం మండలం పెనుబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 2 క్రికెట్ కిట్లు, 2 వాలీబాల్, 3 షటిల్ బ్యాడ్మింటన్ సెట్లను నెల్లూరు నగరం మాగుంట లేవుట్లోని ఆమె నివాసంలో విద్యార్థులకు అందజేశారు.