GST Collections: రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు
స్తు సేవల పన్ను(జీఎస్టీ) రికార్డు సృష్టించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు ఏప్రిల్లోనే నమోదయ్యాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
GST Collections: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రికార్డు సృష్టించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు ఏప్రిల్లోనే నమోదయ్యాయి. ఆ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలో రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం కేంద్ర జీఎస్టీ రూ.43,846 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.53,538 కోట్లు, కేంద్రరాష్ట్ర ఉమ్మడి జీఎస్టీ రూ.99,623 కోట్లు, సెస్ పన్ను రూ.13,260 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. కిందటి ఏడాదితో పోలిస్తే 12.4% పెరిగి రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశయంగా ఈ లావాదేవీలు 13.4% పెరిగింది. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లుగానే నమోదు అయ్యింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో నికర జీఎస్టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 17.1 శాతం పెరిగి రూ.1.92 లక్షల కోట్లుగా నమోదైంది.
GST collection crosses ₹ 2 lakh crore benchmark, thanks to the strong momentum in the economy and efficient tax collections. Congratulations to the Central Board of Indirect Taxes & Customs (@CBIC_India), Dept of Revenue, all officers at the state and central levels. Their…
జీఎస్టీ నెలవారీ వసూళ్లు
2024 ఏప్రిల్ – రూ.2.10 లక్షల కోట్లు
2023 ఏప్రిల్ – రూ.1.87 లక్షల కోట్లు
2024 మార్చి – రూ.1.78 లక్షల కోట్లు
2024 జనవరి – రూ.1.74 లక్షల కోట్లు
2023 అక్టోబరు – రూ.1.72 లక్షల కోట్లు