»Shocking News For Smoking Lovers 75 Percent Gst On Cigarettes
GST: స్మోకింగ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. పొగాకుపై 75 శాతం పన్ను?
పొగాకు ఉత్పత్తులపై 75 శాతం ఎక్సైజ్ పన్నును విధించాలని ప్రభుత్తం ఆలోచనలో ఉంది. వీటి ధర పెంచితే వినియోగం తగ్గుతుందని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ ఆర్ధిక వేత్త డాక్టర్ రిజో జాన్ సూచించారు.
Shocking news for smoking lovers.. 75 percent GST on cigarettes?
GST: సిగరేట్లు(cigarettes) తాగడం యువత ఒక ఫ్యాషన్‌గా భావిస్తుంది. ఆడా మగా అని తేడా లేకుండా అందరు సిగరేట్లు తెగ కాల్చేస్తున్నారు. ఇది అనారోగ్యం అని తెలిసినా స్మోక్ చేయడం పరిపాటి అయిపోయింది. వీరి బలహీనతతో టొబాకో కంపెనీలు వ్యాపారం చేసుకుంటున్నాయి. దీనిపై ప్రభుత్తం కూడా బాగానే సంపాదిస్తుంది. తాజాగా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజు పన్నును పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 2024-25 కేంద్ర బడ్జెట్లో టొబాకో ఉత్పత్తులపై ట్యాక్సీ పెంచాలని వైద్యులు, ఆర్థిక వేత్తలు, ప్రజారోగ్య ఉద్యమకారులు ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు.
ప్రస్తుతం సిగరెట్లపై 49.3 శాతం, బీడీలపై 22 శాతం, గుట్కాపై 63 శాతం పన్ను విధిస్తున్నారు. అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై 75 శాతం పన్ను విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలు ఉన్నాయి. అయితే భారత్ తక్కువగానే పన్నును విధిస్తుంది. జీఎస్టీని తీసుకొచ్చినప్పటి నుంచి పొగాకు పన్నును పెంచలేదనీ, ఇప్పుడు దాన్ని పెంచాలని ఆరోగ్య ఆర్థికవేత్త డాక్టర్ రిజో జాన్ సూచించారు. టొబాకో ఉత్పత్తులపై పన్ను పెంచితే వాటి వినియోగం తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడుతుందన్నారు. వీటిపై తక్కువ పన్ను విధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందని ఆరోగ్యంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల వ్యాఖ్యానించింది. దీని వలన నోటి క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయని తన నివేదికలో తెలిపింది. తరువాత ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఉదర క్యాన్సర్లు వస్తున్నాయని పేర్కొంది. పొగాకు పన్నును పెంచగా వచ్చే అదనపు ఆదాయాన్ని క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించాలని కమిటీ సూచించింది.