ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి బర్రెలక్కకు అనుకూలంగా ట్వీట్ చేశాడు. బర్రెలక్కగా పేరొందిన శిరీష ఏకంగా మహాత్మా గాంధీతో పోల్చుతూ ఆయన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్కపై ట్వీట్ చేశారు. బర్రెలక్క శిరీషను మహాత్మాగాంధీతో పోల్చుతూ ట్వీట్ చేశారు. మహాత్మాగాంధీ ఏ విధంగా అయితే పోరాటం చేశారో, అదేవిధంగానే బర్రెలక్క కూడా తెలంగాణలో పోరాటం చేస్తున్నారని ఆర్జీవీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
బర్రెలక్కపై ఆర్జీవీ చేసిన ట్వీట్:
Barrelakka is today’s Mahatma Gandhi ..GANDHI ji started his revolutionary movement against INJUSTICE exactly like BARRELAKKA 🙏
కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల నుంచి కొల్లాపూర్‌కు వచ్చి శిరీషకు అండగా నిలుస్తున్నారు. ఆమె గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతూ బర్రెలక్క ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ తరుణంలో ఆమెను మహాత్మాగాంధీతో పోల్చుతూ ఆర్జీవీ ట్వీట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తి నెలకొంది.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అని ఆర్జీవీ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఎన్నికల వేళ పవన్ సభ కంటే కూడా బర్రెలక్క సభ ఎంతో బెటర్‌గా ఉందని, పవన్ సభలో మైకులు కూడా పనిచేయడం లేదని, బర్రెలక్క సభలో జనసంద్రం కూడా బావుందన్న ఆర్జీవీ..పవన్ సభకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో జనసైనికులు ఆర్జీవీపై మరోసారి మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.