VZM: రామభద్రాపురం మండలం రొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీసులు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్పం కార్యక్రమంలో బాగంగా మత్తు పదార్థాల వల్ల జరిగే అనార్ధాలపై విద్యార్థులకు బొబ్బిలి గ్రామీణ సీఐ నారాయణరావు, సిబ్బందితో బుధవారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.