SRCL: వీర్నపల్లి మండలం శంకర్ నాయక్ తాండ, రెడ్డి తండా, అజ్మీర తండా, కెలూత్ తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలని మంత్రి సీతక్కకు హైదరాబాదులో LHPS నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీతక్క తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని LHPS నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా నాయకులు ప్రతాప్, అజ్మీర, నరహరి ఉన్నారు.