నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ 2’ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. దీని OTT డీల్ భారీ ధరకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ.80 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది బాలయ్య కెరీర్లో అత్యధికంగా OTT హక్కులు అమ్ముడైన మూవీగా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.