తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ఇడ్లీ కడై’. అక్టోబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో నటుడు సముద్రఖని నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆయన మారిస్వామి పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఇప్పటికే ఈ చిత్రంలో నిత్య మీనన్, షాలిని పాండే, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.