బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో తన ప్రమేయం లేకుండా ఈడీ నోటీసులు జారీ చేసిందని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 16 తేదీకి వాయిదా వేసింది. సీఆర్పీఎస్ నిబంధనలు పాటించడం లేదని, ఈడీ ఆఫీసులో మహిళను విచారించడం సరికాదంటూ కవిత పిటిషన్లో పేర్కొంది.
ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను ఆమె కోరారు. ఇక, కవిత పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ చేపట్టారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి తదితరులతో కూడిన సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సౌత్ గ్రూప్ నిధులు సమకూర్చిందని ఈడీ తెలిపింది. ఈ కేసులో శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. 2023 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కవిత దగ్గర సీఏ పని చేసిన బుచ్చి బాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఇకపోతే ఈనెల 16వ తేదికీ విచారణను వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది. దీంతో కవితకు మరోసారి షాక్ తగిలినట్లైంది.