ఐఏఎస్ ఆఫీసర్ కె.ఆమ్రపాలికి రేవంత్ సర్కార్ మరో రెండు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెట్(హెచ్జీసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Amrapali: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కె.ఆమ్రపాలికి రేవంత్ సర్కార్ మరో రెండు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెట్(హెచ్జీసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమ్రపాలి ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలి ఈ పోస్టులు అన్నింటిని నిర్వహించడానికి కార్యాలయాలన్ని ఒకే చోటుకు తరలిస్తున్నారు. ఆమ్రపాలి గతంలో కేంద్రంలో విధులు నిర్వహించారు. డిప్యుటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకు తిరిగివచ్చిన ఆమ్రపాలికి రేవంత్ సర్కార్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది.