TG: గ్రూప్-1 పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ BRSV ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే గ్రూప్-1 పరీక్షను వెంటనే రద్దు చేసి, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరారు.