ఉల్లికాడలలో విటమిన్ C, B2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఉల్లికాడలతో కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరవు. ఎముకలు దృఢంగా మారుతాయి. అంటువ్యాధులు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.