KMM: ఖమ్మం త్రీ టౌన్ అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ చౌక్, పీఎస్ఆర్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. త్రీ టౌన్ సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం తప్పదని ఆయన ప్రభుత్వాన్నిహెచ్చరించారు.