JGL: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు కథలాపూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు ఎస్సైకి ఫిర్యాదు లేఖను అందజేశారు. నాయకులు నాగరాజు, అజీమ్ పాల్గొన్నారు.