TG: రేపటి నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి భీమేశ్వర ఆలయంలో దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భీమేశ్వర ఆలయంలోనే కోడే మొక్కలు, అభిషేకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మార్పులను భక్తులు గమనించాలని కోరారు.