అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిస్సిస్సిప్పిలోని లేలాండ్ హైస్కూల్లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. USలో తరచుగా జరుగుతున్న కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి.