KNR: కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలకు మహర్దశ వచ్చిందని బీజేపీ మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ అన్నారు. శనివారం కన్నాపూర్ గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ నిధులతో బోరుబావులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు బండి సంజయ్, జిల్లా మండల బీజేపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు.