క్రికెట్ చరిత్రలో పెను సంచలనం నమోదైంది. పసికూన నమీబియా జట్టు సొంతగడ్డపై జరిగిన టీ20 మ్యాచ్లో బలమైన సౌతాఫ్రికా జట్టుకు షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 134/8 పరుగులు చేసింది. అనంతరం నమీబియా చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.