AP: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో A1 అద్దెపల్లి జనార్దనరావుకు కోర్టు వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ఈ నెల 17 వరకు రిమాండ్లో ఉండనున్నారు. 2012 నుంచి మద్యం వ్యాపారం చేస్తున్న ఆయన.. 2021లో నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అంచెలంచెలుగా విస్తరించినట్లు తెలిపారు.