TG: ధాన్యం దిగుబడిలో రాష్ట్రం రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలో అత్యధిక పంట పండించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ వానాకాలంలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు.