జగిత్యాల రూరల్ మండలం చలిగల్ జడ్పీ హైస్కూల్లో చదువుతున్న గమ్య అనే విద్యార్థిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్లు పీడీ వెంకటలక్ష్మి తెలిపారు. జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గమ్య ప్రతిభచూపారన్నారు. వచ్చే వారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ పోటీల్లో గమ్య పాల్గొంటారన్నారు.