WGL: ఉమ్మడి జిల్లాలో తెల్ల కాగితం పై భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టా రూపంలో పాసుబుక్ ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. భూభారతి చట్టం సెక్షన్ 6(1) కింద 12-10-2020 నుంచి 10-11-2020 మధ్య దాఖలైన సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి WGL జిల్లాలో 1,79,697 దరఖాస్తులు రాగా, కొంతమంది రైతులకు లబ్ధి చేకూరనుంది.