NRML: జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు గురువారం వినతి పత్రం సమర్పించారు. గత 4 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఆర్టీఎఫ్ ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యాసంస్థలను ఆదుకోవాలని కోరారు.