VZM: రాజాం మెయిన్ రోడ్ గాయత్రీ కాలనీ పరిధి కొత్త కల్వర్టు నిర్మించి సైడ్ వాల్స్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి సగంలో ఆపేశారు. రోజు ఈ మార్గం గుండా వందలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం కల్వర్టు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోని కల్వర్టు పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.