సెర్బియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులకు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ మద్దతు పలికారు. దీంతో ప్రభుత్వం నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే జకోవిచ్ గ్రీస్‌కు మకాం మారుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రీక్ గోల్డెన్ వీసాకు అతడు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.