Finance Minister Nirmala Sitharaman, introduce the Interim Budget, is focusing on these 5 sectors
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పించనున్నారు. వివిధ రంగాల వారు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు దేశంలోని వ్యాపారవేత్తల సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT), బడ్జెట్లో దేశంలోని వ్యాపార తరగతికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, GSTని సరళీకృత వ్యవస్థగా మార్చాలని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించింది. కొత్త జీఎస్టీ చట్టాన్ని సవరించాలి.. సమగ్రంగా సమీక్షించాలని కోరారు.
దేశంలోని సామాన్య వ్యాపారవేత్త కూడా సులువుగా చట్టాన్ని అనుసరించే విధంగా సవరించాని వ్యాపారవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం, GST పన్ను వ్యవస్థ సంక్లిష్టతలతో బాధపడుతోంది, ఇది సరిదిద్దడం చాలా ముఖ్యం, ఇది GST పన్ను పరిధిని పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ప్రతి జిల్లా స్థాయిలో అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన జీఎస్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, తద్వారా జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని, జిల్లా స్థాయిలోనే పరస్పర సమన్వయంతో జీఎస్టీ పన్ను పరిధిని పెంచవచ్చని క్యాట్ సూచించింది.
ఆలిండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బిసి భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. కంపెనీల వంటి వ్యాపారులకు ఆదాయపు పన్ను ప్రత్యేక శ్లాబ్‌ను రూపొందించాలన్నారు. అలాగే వాణిజ్యానికి సంబంధించిన అన్ని చట్టాలను సమీక్షించి, వాడుకలో లేని చట్టాలను తొలగించాలన్నారు. ఒకే దేశం – ఒకే చట్టం అనే దార్శనికతను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందులో వ్యాపారులకు లైసెన్స్ కూడా జోడించాలి. వ్యాపారం చేయడానికి అనేక రకాల లైసెన్సులు తీసుకోవాలి, వాటి స్థానంలో ఒక లైసెన్స్ విధానాన్ని మాత్రమే ప్రకటించాలి.
దాదాపుగా సిద్ధంగా ఉన్న నేషనల్ రిటైల్ ట్రేడ్ పాలసీని కూడా తక్షణమే అమలు చేయాలన్నారు. అయితే ఈ-కామర్స్ పాలసీ, నిబంధనలను ఇక ఆలస్యం చేయకుండా ప్రకటించాలని క్యాట్ అభ్యర్థించింది. వ్యాపారులకు తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు అందించే పథకాన్ని ప్రకటించాలన్నారు. ప్రస్తుతం వ్యాపారులకు పింఛన్ ఇస్తున్న విధానాన్ని సవరించి మళ్లీ అమలు చేయాలని అన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో హోల్‌సేల్ వ్యాపారం కోసం ప్రత్యేక ట్రేడ్ జోన్‌ను రూపొందించే ప్రకటన రావాలని, అక్కడ ప్రభుత్వం విండోను ఏర్పాటు చేయాలని, తద్వారా అన్ని రకాల ప్రభుత్వ ప్రక్రియలను సింగిల్ విండో ద్వారా పూర్తి చేయాలని ఆయన అన్నారు. టెక్స్టైల్స్, బొమ్మలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటో విడిభాగాలు, హార్డ్‌వేర్, జ్యువెలరీ, రెడీమేడ్ వస్త్రాలు మొదలైన వివిధ ట్రేడ్ల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని CAT కోరింది. భారతదేశ ఎగుమతులు వేగంగా పెరగడానికి సంస్థలతో ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలన్నారు.