Ravi Teja: గెట్ రెడీ.. రవితేజ బర్త్ డే ట్రీట్ వచ్చేస్తోంది!
స్టార్ హీరోల బర్త్ డేలకు కొత్త సినిమాల అప్డేట్స్ రావడం కామన్. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే ట్రీట్ రెడీ అయిపోయింది. జనవరి 26న బర్త్ డే వేడుకలు జరుపుకోనున్న మాస్ రాజా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
Ravi Teja: ఈసారి సంక్రాంతికే రవితేజ ఈగల్ మూవీ ఆడియెన్స్ ముందుకు రావాల్సింది. కానీ థియేటర్ల సమస్య కారణంగా ఫిబ్రవరికి వెళ్లిపోయాడు. ఫిబ్రవరి 9న ఈగల్ రిలీజ్ కానుంది. రవితేజకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని సంక్రాంతి నుంచి తప్పించిన సినీ ప్రముఖులు.. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈగల్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. ఈ క్రమంలో రవితేజ బర్త్ డే ట్రీట్ కూడా రాబోతోంది. జనవరి 26 రవితేజ బర్త్ డే కానుకగా రవితేజ సరికొత్త మేకోవర్ని రివీల్ చేస్తూ.. ఈగల్ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజ లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది.
పోనీ టైల్ వేసుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈగల్ నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేసేలా ఉంది. ఇక పై వచ్చే కంటెంట్‌తో మరింత అంచనాలు పెంచడానికి మేకర్స్ ట్రై చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ కూడా బయటికొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా నుంచి కూడా మాస్ రాజా బర్త్ డే స్పెషల్ ట్రీట్ రానుంది.