అభిసేక్ అగర్వాల్ రవితేజ స్టారర్ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. కానీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రాబడి పరంగా కొంత ఆయన నష్టపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అభిషేక్ అగర్వాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన రేంజ్‌ని ఇనుమడింపజేస్తూ టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి తనదైన విలువని, ప్రతిష్టని కట్టబెట్టే విధంగా అడుగులు వేశారు. సైన్ లాంగ్వేజ్‌లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని రూపోందించారు.
Abhishek Agarwal is another innovative record. Tiger Nageswara Rao in Sign Language. First time in India.
Abhishek Agarwal: భారీ చిత్రాలు నిర్మించడం వేరు. వాటి మీద లాభాలను ఆర్జించడం వేరు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. సినిమా పరిశ్రమ పుట్టిననాటి నుంచి నిర్మాతలు దాదాపుగా ఇదే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. కాకపోతే మొదట్లో లాభాపేక్ష కన్నా కూడా క్వాలిటీతో పాటూ, కొంత నియమనిబద్ధతతో మరపురాని సినిమాలను నిర్మించాలనే తాపత్రయం, కీర్తప్రతిష్టల కోసం ఆరాటం నిర్మాతలలో ఎక్కువగా ఉండేది. అందుకే ఆనాటి సినిమాలు కళాఖండాలుగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పటికీ వాటి దరిదాపులకు వచ్చే సినిమాలను చెప్పమంటే వేళ్ళ మీద లెక్కపెట్టి చెప్పగలుగుతాం. ఇటీవల పూర్తిగా నిర్మాణ శైలి, నిర్మాతల ఒరవడి, పోకడలు మార్తిపోయాయి.
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించగలిగే కాంబినేషన్లను చూసుకుంటున్నారు. ముందస్తుగానే ఆ కాంబినేషన్లమీద జరిగే వ్యాపారలావాదేవీలను చక్కబెట్టుకుని లాభాలతో ఖాతాలను నింపుకుంటున్నారు. వ్యాపారపరంగా అది తప్పు కాకపోవచ్చు. ఇటీవల అయితే మరీ మార్పు వచ్చేసింది. కాంబినేషన్ సెట్ చేశామా, అమ్మేశామా, లాభాలను తెచ్చుకున్నామా అనేదే ప్రధానమైన సూత్రంగా సినిమా నిర్మాణం ఆద్యాంతం వ్యాపారంగా మాత్రమే తయారైపోయింది. దీన్ని ఎవరూ నిందించే పరిస్థితి కూడా కాదు. అంతా కొట్ల మీద జూదంలాగా అయిపోయింది. విజయవంతమైన సినిమాల గురించి పక్కన బెడితే, ఓ మోస్తరుగా అడిన సినిమాలైతే ఎంత పెద్ద సినిమా అయినా సరే కాస్త అటూఇటూ అయితే గనక, దాన్ని ఏదో విధంగా ఏదో ఒక ఓటీటి ప్లాట్ఫార్మ్కి అమ్మేసి చేతులు దులుపుకుని బ్రతుకు జీవుడా అనుకుంటున్నారు.
అంతేగానీ, తర్వాత దాని ఊసు పట్టించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండడం లేదు. మరో సినిమా గొడవలో పడిపోయి ముందుకు పోతున్నారు. వెనక్కి తిరిగి చూసి దాని ఊసెత్తడానికి కూడా క్షణకాలాన్ని కూడా ఎవరూ వెచ్చించడం లేదు. కానీ పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా భారీ చిత్రాలు నిర్మించే నిర్మాతలలో అక్కడక్కడ ఏ ఒక్కరో కనిపిస్తారు. సినిమా కొంతవరకూ నిరాశపరిచినా, దాని వల్ల లాభాల మాట అటుంచి, కొంతైనా నష్టాలను చవిచూసినా కూడా తన వ్యక్తిగతమైన ప్రతిష్ట నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందువల్ల ఆ మోస్తరు సినిమాకి కూడా చాలా విస్తృతమైన ప్రచారం, ఆ సినిమాహీరోకి :ఊహించనంత పాప్యులారిటీ రావడం ఎక్కడో ఎప్పుడో గానీ జరగదు.
కానీ త్రిబుల్ ఏ సంస్థ అధినేత, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి చిత్రాలతో దేశవ్యాప్త సంచలనం సృష్టించిన సుప్రసిద్ధ నిర్మాత అభిషేక్ అగర్వాల్ రెగ్యులర్ వ్యవహారానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అభిసేక్ అగర్వాల్ రవితేజ స్టారర్ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కావాల్సిదాని కన్నా కూడా ఎక్కువ బడ్జెట్‌నే వెచ్చించి మరీ నిర్మించారు. కానీ టైగర్ నాగేశ్వరరావు ఆయనకి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రాబడి పరంగా కొంత ఆయన నష్టపోవాల్సి వచ్చింది కూడా అని ట్రేడ్ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకున్నాయి.
అయినప్పటికీ అభిషేక్ అగర్వాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన రేంజ్‌ని ఇనుమడింపజేస్తూ టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి తనదైన విలువని, ప్రతిష్టని కట్టబెట్టే విధంగా అడుగులు వేశారు. అదేంటయ్యా అంటే…..మనం ఎప్పుడో దూరదర్శన్‌లో బదిరులకు వార్తలు అని చూసేవాళ్ళం. గుర్తండే ఉంటుంది. ఆ ప్రక్రియనే అంటే సంజ్ఞలతో, చేతుల కదలికలతో వార్తలను చెవిటివారికి కూడా అర్ధమయ్యే రీతిలో చూపించేవారు. దానినే సైన్ లాంగ్వేజ్ అంటారు. ఆ పద్ధతిలో, సైన్ లాంగ్వేజ్‌లో ఆయన టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని కూడా ప్రజెంట్ చేశారు. ఇది దేశంలోనే తొలిసారి.
ఏ చిత్రం కూడా ఇంతవరకూ సైన్ లాంగ్వేజ్ వచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి ఆ ప్రయత్నానికి పూనుకున్న ఏకైక నిర్మాత అభిషేక్ అగర్వాల్ అని పరిశ్రమంతా అయనను అభినందనలలో ముంచెత్తుతోంది. ప్రైమ్ వీడియో ఓటిటిలో సైన్ లాంగ్వేజ్‌లో రిలీజైన మొట్టమొదటి సినిమాగా టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని తయారు చేయడమే కాకుండా, అటువంటి ప్రక్రియకు తొలిసారి శ్రీకారం చుట్టిన నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ రికార్డు సృష్టించారు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ టు చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు మరో మైలురాయిని కూడా తన కెరీర్లో నిలుపుకున్నారు.