»I Wont Do It No Matter What Mrinals Comments Are Viral
Mrinal Thakur: ఏది పడితే అది చేయను.. మృణాల్ కామెంట్స్ వైరల్
తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు తెలుగు కుర్రాళ్లు. అయితే.. తాజాగా ఏది పడితే అది చేయను అంటూ మృణాల్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
I won't do it no matter what.. Mrinal's comments are viral
Mrinal Thakur: సీతారామం సినిమా క్లాసికల్ హిట్ అవడంతో.. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటోంది మృణాల్ ఠాకూర్. ఇటీవలె న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. నెక్స్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్సీ 16లోను మృణాల్ పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం మృణాల్ చేతిలో అన్ని భాషల్లో కలిపి నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన కెరీర్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కథలు, పాత్రల ఎంపిక విషయంలో మీకు స్ఫూర్తినిచ్చే అంశాలేంటి? అని అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.
నా లక్ష్యం ఎప్పుడూ ఒకట.. మృణాల్‌గా ఆడియెన్స్ నన్ను గుర్తు పెట్టుకోకపోయినా నా పాత్రలతో గుర్తుండిపోవాలి. అందుకే సీతారామం సీతగా, హాయ్ నాన్న సినిమాలో యష్నగా గుర్తుండిపోవాలనుకున్నాను. వచ్చిన ఆఫర్లు ఓకే చేయడం తనకు నచ్చదని, మంచి పాత్ర కోసం ఎదురు చూస్తుంటాని చెప్పుకొచ్చింది. అలాగే.. తొందరపడి ఏది పడితే అది చేయను అని చెప్పింది మృణాల్. కాబట్టి మృణాల్ ఆఫర్లు వస్తున్నాయని ఎలా పడితే అలా కాకుండా మంచి కథలే ఎంచుకుంటోందనే చెప్పాలి. అన్నట్టు సినిమా విషయంలోనే కాదు.. పెళ్లి కోసం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.. ఓపిక పడితే సరైన జీవిత భాగస్వామి దొరుకుతాడని గతంలో చెప్పుకొచ్చింది మృణాల్.