ప్రస్తుతం అక్కినేని మూడో తరం హీరో నాగ చైతన్య 'తండేల్' అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి తండేల్ రిలీజ్ ఎప్పుడు?
Naga Chaitanya: ఇప్పటి వరకు నాగ చైతన్య అటెంప్ట్ చేసిన మాస్ సినిమాల కంటే భారీగా, చైతూ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తండేల్ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తూ ఉండటంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇదే. రీసెంట్గా వచ్చిన తండేల్ ఫస్ట్ గ్లింప్స్ కూడా సినిమా అంచనాలు పెంచేసింది. ఊరమాస్ లుక్లో కనిపిస్తున్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతోంది.
చైతూ ఈ మూవీలో జాలరీగా నటిస్తున్నాడు. ప్రజెంట్ జెట్ స్పీడ్లో తండేల్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు.. మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఆగష్టు లేదా సెప్టెంబర్లో తండేల్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి.. మరో పెద్ద సినిమాతో క్లాష్ లేకుండా అన్ని భాషల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. వీలైనంత త్వరగా తండేల్ షూటింగ్ కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తండేల్ రిలీజ్ డేట్ విషయంలో అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి తండేల్తో నాగ చైతన్య పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.