Maruti Suzuki: భారతీయకార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో ఓ సంచలానికి తెరలేపింది. మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మారుతి సుజికి సంస్థ చిన్నపాటి హైబ్రిడ్ కారును తీసుకురాబోతుంది. ఈ కారు ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తామని మారుతి సుజుకి కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లకంటే అధిక మైలేజి ఇస్తుందని వెల్లడించారు. వివిధ హైబ్రిడ్ కార్లలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అధిక ఖర్చుతో కూడుకున్నదని, అందుకే వాటి ధర కూడా అధికంగా ఉంటుందని తెలిపారు.
కానీ ఇప్పుడు తీసుకు రాబోతున్న హైబ్రిడ్ కారులో తక్కువ ఖర్చుతో హైబ్రిడ్ కార్ల సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని చైర్మన్ భార్గవ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర సహకారం కావాలని, వినియోగదారుల ముందుకు తీసుకురాబోతున్న హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని, అలా అయితే కారు ధర ఇంకా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ కారు ధర, ఇతరు వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో టాటా మోటర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అంటూ నోనో కారును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఉన్న లోపాల వలన అది మార్కెట్లో పెద్దగా నిలబడలేదు. మరి ఇప్పుడు తీసుకొస్తున్న మారుతి సుజికి కారు ఎలా ఉండబోతుంది అని పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు.