Jimny Sales: ఎస్యూవీ సెగ్మెంట్లలో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ వేరే.. ఆ కారు అంటే యువత పడిచస్తారు. మైలేజ్ రాకున్నా.. స్టైలిష్‌గా ఉంటుంది. కేవలం నలుగురు వెళ్లేందుకు మాత్రమే వీలు ఉంటుంది. అయినప్పటికీ ఆ కార్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ కారుకు పోటీగా మారుతి సుజుకీ జిమ్నీ (Jimny) కారు తీసుకొచ్చింది. మొదట్లో ఆ కారు సేల్స్ జరిగాయి. క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి.
తగ్గుతున్న విక్రయాలు
ఫస్ట్ ఏంటంటే.. లుక్‌లో థార్ కన్నా జిమ్నీ (Jimny) ఏమంత బాగోదు. ధర కూడా థార్ కన్నా జిమ్‌నే ఎక్కువ.. సో.. ఆ కారు సేల్స్ పడిపోయాయి. ఎలా అంటే.. జూన్‌లో 3071 సేల్ అయితే.. జూలైలో కాస్త పెరిగాయి. 3778కి చేరాయి.. ఆగస్టు నుంచి పడిపోవడం మొదలైంది. ఆ నెలలో 3104 కార్లు, సెప్టెంబర్‌లో 2651 కార్లు, అక్టోబర్‌లో 1852 కార్లు అమ్ముడు పోయాయి. ఇక నవంబర్‌లో ఆ సంఖ్య 1020కి చేరింది. దీంతో కారు సేల్స్ పెంచడంపై సంస్థ ఫోకస్ చేసింది.
కారు ఓకే.. కానీ
కారు బాగుందని కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు.. ధర విషయంలో ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. జెటా, ఆల్పా రెండు వేరియంట్లలో జిమ్నీ లభిస్తోంది. జెటా మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ధర రూ.12.74 లక్షలు.. దానిని రూ.2.21 లక్షలు తగ్గించింది. అంటే రూ.10.53 లక్షలకు కారు రానుంది. అంటే థార్ ధర రేంజ్లో బేసిక్ కారు అందుబాటులో ఉండనుంది. ఇక జెటా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఇదివరకు రూ.13.94 లక్షలు ఉండే.. దానిపై కూడా రూ.2.21 లక్షలు తగ్గించింది. అంటే ఆ కారు కూడా 11.73 లక్షలకు విక్రయించనుంది.
భారీగా ధరల తగ్గింపు
ఇక అల్ఫా ధర రూ.13.69 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్య ఉన్నాయి. ఆ కార్లపై కూడా రూ.1.21 లక్షల మేర తగ్గించింది. దీంతో ఒక్కో వేరియంట్ కారు ధర తగ్గనుంది. జిమ్నీలో లిమిటెడ్ ఎడిషన్ అయిన థండర్ రూ.10.74 లక్షలకే లభించనుంది. జిమ్నీ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 105 పీఎస్ పవర్, 134 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది. 5 స్పీడ్ ఎంటీ, 4 స్పీడ్ ఏటీ ఆప్షన్లలో లభిస్తోంది. ఎంటీ వేరియంట్లలో లీటర్‌కు 16.94 కిలోమీటర్లు, ఏటీ వేరియంట్లలో 16.39 కిలోమీటర్ల మేర మైలేజీ ఇస్తోంది.