మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ లేపింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధిక విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది.
Record Liquor Sale: ఏ పండగ అయినా సరే.. తెలంగాణలో ముక్క, దానికి చుక్క (Liquor) ఉండాల్సిందే. ఒకప్పుడు ఈతకల్లు, తాటికల్లు వినియోగం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అంతా బీర్, వీస్కి అంటున్నారు. రకరకాల బ్రాండ్లు తీసుకుంటున్నారు. అందుకేనెమో దక్షిణ భారతదేశంలో జరిగిన మద్యం (Liquor) విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లిక్కర్ (Liquor) ద్వారా ఆదాయానికి సంబంధించి అధికారులు నివేదిక సమర్పించారు. అందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ కన్నా తెలంగాణలో లిక్కర్ వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఆ రాష్ట్రాల కన్నా తెలంగాణ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ.. మద్యం సేల్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి.
కేరళ జనాభాను తెలంగాణ కలిగి ఉంది. తలసరి మద్యం వినియోగం మాత్రం ఎక్కువగా ఉంది. తలసరిగా 9 లీటర్ల మద్యం, 10.7 లీటర్ల బీర్ల వినియోగం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే ఉంది. 2022-23 ఏడాదిలో రాష్ట్రానికి రూ.33,268 కోట్ల ఆదాయం సమకూరింది. అదే పొరుగున గల ఆంధ్రప్రదేశ్‌కు రూ.23,804 కోట్లు, కర్ణాటకకు రూ.29,790 కట్లు, కేరళకు రూ.16,189 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణ, కేరళ జనాభా సమానం ఉన్న లిక్కర్ వినియోగంలో తెలంగాణ ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. అందుకోసమే గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను ఎత్తివేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. బార్లు, వైన్ షాప్‌లపై నియంత్రణ విధించాలని భావిస్తోందని తెలుస్తోంది.