»Revanth Reddy Said Order For Acquisition Of New Industrial Areas Thousand Acres Within Orr
Revanth reddy: ORR పరిధిలోనే కొత్త పారిశ్రామిక ప్రాంతాలు..వెయ్యి ఎకరాల సేకరణకు సీఎం ఆదేశం
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు ఓఆర్ఆర్ పరిధిలోనే వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాదు సేకరించిన భూములు బంజరుగా, సాగుకు పనికిరానివిగా ఉండాలని స్పష్టం చేశారు.
Revanth reddy said order for acquisition of new industrial areas thousand acres within ORR
తెలంగాణలో కొత్త పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల 500 నుంచి 1,000 ఎకరాల భూమిని గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవి విమానాశ్రయం, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నుంచి 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు భూములు ఉండాలని ఆయన అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించని భూములపై నివేదిక ఇవ్వాలని కూడా తెలిపారు. మరోవైపు సేకరించిన భూములు బంజరు, సాగుకు పనికిరానివిగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
Chief Minister @revanth_anumula A. Revanth Reddy has mandated the identification of 500 to 1000 acres of land situated beyond the Outer Ring Road yet within the Regional Ring Road for the development of new industrial zones in Telangana. https://t.co/hoGHrBaOU4
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు రేవంత్ రెడ్డి(Revanth reddy)పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పరిశ్రమల వివరాలను అభ్యర్థించారు. కాలుష్యరహిత పరిశ్రమల ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన హైదరాబాద్‌లో ఇప్పటికే రద్దీగా ఉన్న నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ పారిశ్రామిక క్లస్టర్లకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని అధికారులను కోరారు. బల్క్ డ్రగ్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని నివాస ప్రాంతాలకు దూరంగా నిరుపయోగమైన, బంజరు భూములను పరిశ్రమల స్థాపనకు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
మరోవైపు రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ విలేజ్‌లుగా అభివృద్ధి చేసేందుకు సంప్రదాయ విద్యుత్‌కు బదులు సౌర విద్యుత్‌ను వినియోగించాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. బాలానగర్‌లోని ఐడీపీఎల్(IDPL) భూముల స్థితిగతులపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారని, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సీఎంవో అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.