union budget 2024 : కేంద్ర బడ్జెట్‌ని మంగళవారం ఉదయం నిర్మల సీతారామన్(Nirmala Sitharaman ) పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. వరుసగా ఏడో సారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె రికార్డు(record) సాధించారు. ఆమె 2019 మే 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 2019లో మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆమె వరుసగా బడ్జెన్‌ను పార్లమెంటులో ప్రవేశ పెడుతూ వస్తున్నారు.
చదవండి : రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే
2019, 2020, 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఆమె వరుసగా కేంద్ర బడ్జెట్లను ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ఇక ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మళ్లీ 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి బడ్జెట్‌ని(Budget 2024) ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఆమె ప్రసంగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మురార్జీ దేశాయ్ ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా(FM) రికార్డుల్లో ఉన్నారు. ఆయన ఐదు పూర్తిస్థాయి, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ఇంత ఎక్కువ సార్లు బడ్జెట్‌ని ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డులకెక్కారు.
చదవండి : విశ్వంభర తరువాత ఆ డైరెక్టర్ తోనే… చిరు ఇప్పటివరకూ చేయని క్యారక్టర్ అట

