»Flipkart Year End Sale 2023 December 9th 16th 2023
Flipkart year end sale 2023: రేపే మొదలు..ఇవే గ్రేట్ డీల్స్!
మీరు ఏదైనా కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ మొదలు కానుంది. ఈ క్రమంలో అనేక ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
flipkart year end sale 2023 december 9th- 16th 2023
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ 2023 మళ్లీ రానే వచ్చింది. మీరు ఈ సంవత్సరం చివరిలో స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్ మీకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు. ఈ సేల్‌లో మీరు ఆపిల్, గూగుల్, శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లను చాలా చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. అయితే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటే, వారు ఈ రోజు నుంచే సగం రోజుల పాటు సేల్ కొన్ని డీల్‌లను యాక్సెస్ చేయగలరు.
ప్రస్తుతం iPhone 14, Pixel 7, Moto G54 5G, Realme C53, Samsung Galaxy F14 5G, Poco M6 Pro పాపులర్ స్మార్ట్ఫోన్లు Poco M6 Pro 5G, Motorola Edge 40 Neo, Samsung Galaxy S21 FE 5G (2023), Vivo T2 లేదా Vivo T2 తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ టీజర్ ప్రకారం బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో Samsung Galaxy S22 ధర రూ.40 వేలకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.49,999కి అమ్మకానికి అందుబాటులో ఉంది. అలాగే iPhone 14 ప్రస్తుతం 128 GB స్టోరేజ్ మోడల్‌కు రూ.60,999 ధరకు అందుబాటులో ఉంది. Redmi 12 4G ఫోన్ రూ. 9,999 నుంచి తగ్గి రూ.9,499కి తగ్గింది. Poco M6 Pro 5G ఫోన్ రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు. ప్రజలు RS.6,000 కంటే తక్కువ బడ్జెట్ కలిగి ఉంటే, అప్పుడు వారు Poco C51ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ.5,999గా ఉంది. అదేవిధంగా Moto G54 5G, Vivo T2 ప్రో కూడా వరుసగా రూ. 13,999, రూ. 23,999కి విక్రయించబడుతున్నాయి.
వీటితోపాటు ఫ్లిప్కార్ట్సేల్లో టీవీలు, అనేక ఇతర పరికరాలపై 75 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కంపెనీ గిజ్ర్ ఉపకరణాలపై 70% తగ్గింపును అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 50 నుంచి 80 శాతానికి తగ్గింపు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో మీరు ల్యాప్‌టాప్‌ను రూ.9,990కి కొనుగోలు చేయవచ్చు. ల్యాప్‌టాప్ ధరపై కొన్ని బ్యాంక్ సంబంధిత ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.