»Adani Group Is Making Worlds Biggest Green Energy Park In Gujrat Gautam Adani Shares Picture
Adani Green Energy : ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ పార్క్ నిర్మిస్తున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఎడారి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ పార్క్ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో 726 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది.
Adani Green Energy : అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఎడారి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ పార్క్ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో 726 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. ఈ పార్క్ 30 గిగా వాట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 2 కోట్లకు పైగా ఇళ్లకు కరెంట్ నిస్తుంది. పార్క్‌లో జరుగుతున్న పనుల చిత్రాలను గౌతమ్ అదానీ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేశారు. అదానీ గ్రూప్ ఏర్పాటు చేయబోవు ఈ ప్రాజెక్ట్ భారత్ గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌ను నిర్మిస్తున్నామని అదానీ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనంలో భారత అద్భుతమైన పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గర్విస్తున్నామన్నారు. సవాళ్లతో నిండిన రాన్ ఎడారిలో 726 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ తో 2 కోట్ల కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ అందించడానికి 30 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ అదానీ ట్విటర్లో రాసుకొచ్చారు. 2030 నాటికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థలో కార్బన్ ఉద్గారాలను 45శాతం కంటే ఎక్కువగా తగ్గిస్తుంది. కాగా, 2070 నాటికి భారత్ ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధిస్తుంది.
Proud to play a crucial role in India's impressive strides in renewable energy as we build the world's largest green energy park. This monumental project, covering 726 sq km in the challenging Rann desert, is visible even from space. We will generate 30GW to power over 20 million… pic.twitter.com/FMIe8ln7Gn
అదానీ గ్రీన్ ఎనర్జీ సోలార్, విండ్, హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ 8.4 GW పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థ. శుక్రవారం కంపెనీ షేర్లు 5.70 శాతం క్షీణతతో రూ.1533.00 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం ట్రేడింగ్ లో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 15-20 శాతం వరకు పెరిగాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదలకు ముందు.. అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు రూ.2,185.30 వద్ద ఉండగా, ఫిబ్రవరి 28న రూ.439.35కి తగ్గింది. అయితే, అప్పటి నుండి దాని ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది.