»Gautam Adani Will Invest Rs 7 Lakh Crore In The Next 10 Years
Gautam Adani: వచ్చే 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ రాబోయే 10 సంవత్సరాలలో మూలధన వ్యయంలో 7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌ను నిర్మిస్తున్న చిత్రాలను షేర్ చేస్తూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
gautam Adani will invest rs 7 lakh crore in the next 10 years
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(gautam Adani)రాబోయే 10 సంవత్సరాలలో మూలధన వ్యయంగా రూ.7 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తమ గ్రూప్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అదానీ అన్నారు. తమ సంస్థ పెట్టుబడి ప్రణాళికలలో భాగంగా అదానీ తన గ్రీన్ ఇనిషియేటివ్‌ల గురించి సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పంచుకున్నారు. ఈ క్రమంలో తమ సంస్థ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మైనింగ్, విమానాశ్రయాలు, రక్షణ, ఏరోనాటిక్స్, సోలార్ తయారీ, రోడ్లు, మెట్రో, రైలు, డేటా సెంటర్లు సహా వివిధ వనరుల నిర్వహణకు వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ గ్రూప్ పోర్ట్ వ్యాపారం గ్రీన్ డ్రైవ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు.
On a separate note – Adani Group announced 7 lakh crore capex over 10 years, and Tata announced Tata Rs 40,000 cr investment to set up a semiconductor processing plant. The message is clear: Think BIG about INDIA.#AdaniGroup#Tatagroup#Kirtheebane
తాము 2025 నాటికి దేశంలోని ఏకైక కార్బన్-న్యూట్రల్ పోర్ట్ ఆపరేటర్‌గా జాతీయ బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తామని ఈ సందర్భంగా అదానీ ధీమా వ్యక్తం చేశారు. దీంతోపాటు 2040 నాటికి APSEZ నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణ అనుకూల మార్పులలో అన్ని రంగాలను విద్యుదీకరించడం, అన్ని డీజిల్ ఆధారిత వాహనాలను బ్యాటరీ ఆధారిత వాహనాలుగా మార్చడం వంటివి ఉన్నాయని అదానీ రాసుకొచ్చారు. ఇది కాకుండా 1000 మెగావాట్ల అంతర్గత పునరుత్పాదక సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్. ఇది దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలలో ఓడరేవులను కలిగి ఉంది. పర్యావరణ పరిరక్షణ పట్ల మనకున్న అంకితభావం మన విస్తరించిన మడ తోటలలో కూడా ప్రతిబింబిస్తుందని గౌతమ్ అదానీ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించనుందని చెప్పారు. హరిత భవిష్యత్తుకు ఇది మరో ముందడుగని.. వాతావరణ నిర్వహణ పట్ల మన నిబద్ధతను ఇది రుజువు చేస్తుందని తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ఎడారిలో భారీ ఎత్తున నిర్మాణ పనుల చిత్రాలను పంచుకుంటూ అదానీ తన గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌ను నిర్మిస్తోందని చెప్పారు. ఈ ఎడారిలో 726 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భారీ ప్రాజెక్టు అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తోందన్నారు.