Jawan Movie Explained: భారదేశపు సరిహద్దుల్లో సముద్రంలో ఒక బాడీ తెలియాడు ఉంటుంది. నదీ ఒడ్డున పనిచేసే వాళ్లు ఆ బాడీని తీసుకొని గుర్రం మీద వేసుకొని ఊర్లోకి తీసుకొని వెళ్తారు. అతనికి నాటు వైద్యం చేస్తారు. బాడీలో బుల్లెట్లు తీస్తారు. పురాతన పద్దతిలో చీమలను గాయాలను అతికించడానికి వాడుతారు. గుండు గీస్తారు. బాడీ అంతా కట్లు కడుతారు. కొన్ని నెలల తరువాత అని పడుతుంది. ఆ ఊర్లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు ప్రజలు. అదే సమయంలో గ్రామంలో ఎటాక్ జరుగుతుంది. చిన్నపిల్లలను కాల్చిచంపేస్తారు. ఫైర్ పెడుతారు. అందరూ ప్రాణభయంతో పరుగెడుతారు. కాపాడమని దేవుడిని ప్రార్ధిస్తారు. బయట సౌండ్స్ విని కట్లు ఉన్న వ్యక్తిలో చలనం వస్తుంది. ఒక లేడిని కత్తితో నరకబోతుంటే విల్లు వచ్చి అతని వెన్నులో దిగితుంది. తరువాత కొండపైనుంచి కట్లు కట్టిన వ్యక్తి కిందకి దూకి వాళ్లతో ఫైట్ చేస్తాడు. తన కట్లకు ఫైర్ అంటుకుంటుంది. మెల్లిగా తన ఫేస్ రివీల్ అవుతుంది. అందరిని చితక్కొడుతాడు. అక్కడున్న వారంత చూస్తూ నిలబడుతారు. అందరు అతన్ని మొక్కుతారు. నేను ఎవరిని అని వాళ్లతో అంటాడు.
30 సంవత్సరాల తరువాత అనే టైటిల్ పడుతుంది. మెట్రోలో ప్రెగ్నెన్స్ తో కల్కి ఎక్కుతుంది. ఒక పిల్లాడు చూసి బేబీనా అంటే కాదు బాంబ్ అంటుంది. తరువాత వారు కమ్యూనికేట్ చేసుకుంటారు. రోడ్డులో యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతో 20 నిమిషాల్లో ఎగ్జామ్ ఉందని ఒక అమ్మాయి చెకాలకు మెట్రో టికెట్ అడుగుతే ఛేంజ్ లేదంటాడు మెట్రో టికెట్ ఇచ్చే అతను. తన వెనుకాలే ఉన్న లక్ష్మీ డబ్బులు ఇచ్చి చెకాలకు రెండు టికెట్లు తీసుకుంటుంది. వారు మెట్రోలో ఎక్కి కూర్చుంటారు. అదే స్టేషన్లో అజాద్ ఎక్కి కూర్చుంటాడు. తరువాత వారంత కలిసి మెట్రోన్ హైజాక్ చేస్తారు. మెట్రోలో ఉన్న వారు కంగారు పడుతారు. అంతలో ఓ పోలీసు ఒకరిని కిందపడగొట్టి గన్ తలకు గన్ను పెడుతాడు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నేను పోలీసును అని చెప్తాడు. అదే సమయంలో తల కట్టున్న అజాద్ మెళ్లిగా లేచి పోలీసు దగ్గరకు వస్తుంటాడు. అక్కడే ఉండండి.. ఏ ముసలోడా ఎక్కడి వస్తున్నావు అని అరుస్తాడు పోలీసు. అజాద్ అలానే దగ్గరకు వచ్చి పోలీసును కొట్టి నేను కాదు ముసలోన్ని నీ అబ్బ ముసలోడు అని పోలీసును బందిస్తాడు. తరువాత కెప్టెన్ అనే ట్యాగ్ తీసుకొని తన షర్ట్‌కు అంటించుకొని తానే కొత్త కెప్టెన్ అని చెప్తాడు. తరువాత ఒక ముస్లిమ్ అమ్మాయిని కాల్చి చంపేస్తాడు. మెట్రో ఇంచార్జ్ తో వాకీటాకీలో మాట్లాడుతాడు.
చదవండి:Animal: మూవీపై అల్లు అర్జున్ రివ్యూ చదివారా?
ముంబై మెట్రోను హైజాక్ చేసినట్లు, ఒక ముస్లిం లేడీని కాల్చి చంపినట్లు న్యూస్ ఛానెల్లో చెబుతూ.. హైజాకర్లతో నేగోషియేట్ చేయడానికి చీఫ్ నర్మద రాయ్ ని నియమిస్తారు అని చెప్తారు. నర్మద ఎంటర్ అవుతుంది.. అజాద్ తో మాట్లాడుతుంది. నేను దేశపౌరుడిని అని. ఎన్ని సార్లు ఓటేసినా ఈ వ్యవస్థ మారదు.. నాకు కావాల్సింది చేస్తాను అందుకే ఈ హైజాక్ అని ఆగ్రహంతో మాట్లాడుతాడు. కామ్ డౌన్ మీకు ఏం కావాలో చెప్పు అని నర్మద అడుగుతుంది. అలియా భట్ కావాలి అని.. మరి చిన్న పిల్ల కాదా అయితే ఓ పాట పాడు అంటాడు హీరో. దాంతో నర్మద ఒక పాట పాడుతుంది. ఈ పాట అయిపోయేలోగా నేను అగ్రికల్చర్ మినిస్టర్ తో మాట్లాడాలి అంటాడు హీరో. అది కుదరదు అంటే 376 మంది ప్రాణాలు లేటయ్యేకొద్ది నిమిషానికి ఒకరు చనిపోతారు అని బెదిరిస్తాడు. తరువాత ఈ మౌనం, ఈ బిడియం సాంగ్ కు హీరో డ్యాన్స్ చేస్తుంటాడు. నర్మద స్టాఫ్ మీద అరుస్తుంది. అగ్రికల్చర్ మినిస్టర్ అరుచుకుంటు వస్తాడు. అతన్ని ఒప్పించి మాట్లాడమని చెప్తుంది. టైమ్ అయిపోతుంది అని ఒక అతని నోట్లో గన్ పెడుతాడు అజాద్. అలోగా అగ్రికల్చర్ మినిస్టర్ లైన్ లోకి వస్తాడు. తరువాత అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు. అది అతనికి తెలియదు ఫైనాన్స్ మినిస్టర్ ను పిలిపిస్తా అంటాడు. అవసరం లేదు నేను చెప్పిన లెక్క రైతుల ఆత్మహత్యలది.. దాదాపు పదివేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తాడు అజాద్. తరువాత మరో క్వశ్చన్ అడుగుతాడు. ఒక రైతు ట్రాక్టర్ కొనడానికి వెళ్తాడు, ఒక బిజినెస్ మ్యాన్ మెర్సడీజ్ బెంజ్ కొనడానికి వెళ్తాడు ఎవరికి తక్కువ వడ్డీ ఇస్తారు అంటే మినిస్టర్ రైతుకే అంటాడు. కాదు అని కారుకు 6 శాతం వడ్డికి ఇస్తే.. రైతుకు 13 శాతం వడ్డి ఇస్తున్నారు అని అజాద్ చెప్తాడు. ఇంకో మార్గం ఉందా అంటే ఉంది అని 40 వేల కోట్లు కావాలి అంటాడు అజాద్. అంత పెద్ద మొత్తం ప్రభుత్వం ఇవ్వలేదు అంటాడు మినిస్టర్. అయితే బిజినెస్ మ్యాన్ అడిగి ప్రయివేట్ గా అరెంజ్ చేయండి అంటాడు. దానికి ఏ బిజినెస్ మ్యాన్ ఒప్పుకోడు అంటాడు మినిస్టర్.. ఒప్పుకుంటాడు.. పది నిమిషాల్లో మీకు కాల్ వస్తుంది అని చెప్పి అలియాతో వాళ్ల నాన్నకు ఫోన్ చేయమంటాడు హీరో.
కలెక్టర్ సంతాప సభలో పాల్గొని అతని గురించి మాట్లాడుతాడు కాళి గైక్వాడ్. ముందు రోజు కలెక్టర్ ను కాళి గైక్వాడ్ బెదిరిస్తాడు. సంతకం పెట్టామని అడిగితే కుదరదు అంటాడు కలెక్టర్. తన కొడుకును ఎత్తుకొని రెడ్ కలర్ మాత్ర వేసుకొమ్మని బెదిరస్తాడు కాళి. లేదంటే తన కొడుకుకు మాత్ర వేస్తా అంటాడు. దాంతో భయపడ్డ కలెక్టర్ మాత్ర మింగేస్తాడు. ఒక్క సంతకం కోసం ప్రాణాలే తీసుకున్నాడు కలెక్టర్ అని అందరిముందు చెప్తాడు కాళి. అదే సభలో పోలీసులు కూడా ఉంటారు. నువ్వు నా కూతురు లాంటిదానివి నీ కొడుకును కలెక్టర్ చేసేంతవరకు నాదే బాధ్యత అని మైక్ లోనే కలెక్టర్ భార్యతో చెప్తాడు కాళి. అక్కడినుంచి బయలు దేరుతాడు. పాప కాల్ చేసింది అని పీఏ ఫోన్ ఇస్తుంది. మురద్ అని గట్టిగా అరుస్తాడు. తరువాత మురద్ వచ్చి మినిస్టర్ కు ఫోన్ ఇస్తాడు. ఫోన్ మాట్లాడిన మినిస్టర్ కాళి గైక్వాడ్ కూతురు అలియా కూడా ట్రైన్ లో ఉంది అతను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అని చెప్తాడు. అంత అమౌంట్ ఇస్తా అన్నాడా అని అందరు ఆశ్చర్యపోతారు. అతనికి కూతురు కన్నా ఏది ఎక్కువ కాదు. అతని దయ వల్లే ఈ ముంబాయ్ నడుస్తుందని చెప్తాడు. అజాద్ కు నర్మద కాల్ చేస్తుంది. డబ్బులు పంపించాడానికి అకౌంట్ నెంబర్ ఈ మెయిల్ చేశాను దానికి పంపించండి అని చెప్తాడు. తరువాత సీన్లో కాళి మనీ ట్రాన్స్ ఫర్ చేస్తాడు. గ్రీన్ కలర్ పిల్ వేసుకుంటాడు. ట్రైన్ లో అలియా లేచి మీరంతా చీటర్స్ నన్ను అడ్డు పెట్టుకొని మా నాన్న దగ్గర డబ్బులు కొట్టేశారు అని అంటుంది. అవును దొంగలమే కాని మేము ఇలా ఎందుకు మారమో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
పరీక్షకు వెళుతూ నాన్న దగ్గర అశీర్వాదం తీసుకుంటుంది కల్కీ. అదే సమయంలో బ్యాంక్ ఆఫీసర్ ఇంటికి వస్తారు. వర్షాలు పడలేదు, పంటలు పండలేదు మ్యానేజరతో మాట్లాడుదాం సర్ అనగానే నేను ప్యూనా.. అని అతన్ని చెప్పుతో కొట్టి, తన దోతి లాగేస్తాడు. కల్కి తండ్రి నెల మీద పడి ఏడుస్తాడు. తల్లి కూతుర్లు ఏడుస్తారు. బ్యాంక్ ఆఫీసర్స్ ట్రాక్టర్ తీసుకెళ్తారు. లేచి కూతుర్ని పరీక్షకు పంపి.. చెట్టుకు ఉరివేసుకుంటాడు. తిరిగొచ్చిన కల్కి తండ్రి శవాన్ని చూసి ఏడుస్తుంది. తరువాత సీన్లో ఆఫీసర్స్ శవం దగ్గరకు వచ్చి మిగితా డబ్బులు అడుగుతారు. మంగళసూత్రం లాక్కుంటారు. కల్కి కోపంతో ఆఫీర్ ను కొడుతుంది. ఈ కథ కేవలం కల్కీదే కాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రైతుది ఇదే కథ. 40 వేల కోసం రైతులు చనిపోతే.. అదే బ్యాంక్ కాళి కోసం 40వేల కోట్లను మాఫీ చేసింది అని ట్రైన్ లో అలియాకు చెప్తాడు హీరో. మీ నాన్నను కలిసినప్పుడు ఒకటి చెప్పు నీ కంటే పెద్ద దొంగని కలిశానని, ఇంకోటి కూడా చెప్పు నా పేరు అని అలియా చెవులో చెప్తాడు. అదే సమయంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతాయి. అందరిని చప్పట్లు కొట్టుమని చెప్తాడు. ఎవరు కొట్టరు. చనిపోయిన లేడీని లేపుతాడు. అందరు చప్పట్లు కొడుతారు. ట్రైన్ మూవ్ అవుతుంది. అతని షర్ట్ కున్న కెప్టెన్ తీసి జవాన్ కు ఇస్తాడు. అదే సమయంలో స్టేషన్ కు నర్మద తన టీమ్ తో వస్తుంది. హీరోకు ఫోన్ చేస్తుంది. మీరు ఎవరు తప్పించుకోలేరు అని ఫోన్ మాట్లాడుతుంది. ట్రైన్ మిర్రర్స్ మొత్తం కవర్ చేస్తారు. నర్మద టీమ్ గన్స్ గరిపెడుతాడు. అదే సమయంలో ట్రైన్ నుంచి దిగే ప్యాసింజరస్స్ అందరు ఫేస్ కు క్లాత్ చుట్టుకొని దిగుతారు. అదే సమయంలో పక్కన ఒక బిల్డింగ్ బ్లాస్ట్ అవుతుంది. ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ప్యాసింజర్స్ అందరూ పరిగెడుతారు. హీరో టీమ్ కూడా వాళ్లలో కలిసి దిగిపోతారు. ట్రైన్ లోకి వెలితే అక్కడో బోమ్మ ఉంటుంది. అందరు తప్పించుకున్నారు అని నర్మదతో చెప్తాడు ఇరాని.. తరువాత పాసింజర్స్ ను ఆపమని ఫోన్ చేస్తే కుదరు అని చెప్తాడు మరో ఆఫీసర్. అకౌంట్స్ ఫ్రీజ్ చేశావా అని ఫోన్ చేస్తే.. ఇది చేయలేము అమౌంట్ అంతా 7లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్తాడు. దాంతో ఎవరు ఈ 7 లక్షల మంది అని నర్మద ఆలోచిస్తుంది. కట్ చేస్తే రైతులు అంత తమ అప్పు తీరిపోయింది. ఎవరో తీర్చేశారు అని సంబరాలు చేసుకుంటారు. అలా దేశంలో రైతులందరు సంతోషంగా ఉంటారు.
దేశంలోని ఏడు లక్షల మంది అప్పును ఒకేసారి తీర్చేశాడు అని న్యూస్ ఛానెల్స్ చెబుతుంటాయి. ఎవరు ఈ రాబిన్ హుడ్ అని అంటుంటారు. ఇదే న్యూస్ ను కాళి గైక్వాడ్ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూస్తాడు. అక్కడే నర్మద ఉంటుంది. వీళ్లకు డబ్బులే ముఖ్యం అయితే కేవలం మీ అమ్మాయినే కిడ్నాప్ చేసేవారు.. వాళ్ల ఇంటేన్షన్ ఇంకేదో ఉంది అని నర్మద అంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే అతని వయసు కూడా పెద్దగా ఉండదు అని చెప్తుంది. మరో సీన్లో అజాద్ తన మాస్క్ తీసేస్తాడు. యంగ్ గా ఉంటాడు. అక్కడున్న గర్ల్స్ కు హైఫై ఇస్తాడు. ఇక్కడ మనం ఆ ఆరుగురి అమ్మాయిల గురించి తెలుసుకోవాలి అని చెబుతుంది. తరువాత సీన్లో అమ్మాయిలుఅ అక్కడినుంచి జైల్ లోకి వెళ్లిపోతారు.
తరువాత కాళితో అలియా మాట్లాడుతూ … నాన్న ఆ హైజాకర్ మీకు ఒకటి చెప్పమన్నారు అని అతని పేరు విక్రమ్ రాథోడ్ అని చెప్తుంది. అతను ఆలోచిస్తాడు. తరువాత సీన్లో.. జైల్లో మీటింగ్ లో జైలర్ ఆజాద్ ఎంట్రీ ఇస్తాడు. బెస్ట్ జైల్ అవార్డు ప్రకటిస్తారు. ఆ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ.. జైల్లో ఉన్నవాళ్లు తనకు తోబుట్టువులతో సమానం అని, ఇక్కడ అందరు చాలా క్రమశిక్షణతో ఉంటారు. హ్యండిక్యాప్ పిల్లలకు ఆర్టిఫిషియల్ లెగ్స్ తయారు చేస్తారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లకు డ్రెస్‌లు కుడుతారు అని చెప్తాడు. ఇక్కడినుంచి బయటికి వెళ్లిన ఎవరు కూడా ఏ నేరాలు చేయలేదని చెప్తాడు. తరువాత సాంగ్ మొదలౌతుంది.
పాట అయిపోయిన తరువాత అజాద్ ఇంట్లో రెడీ అవుతుంటాడు. అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. అక్కడ చిన్నామ్మాయి సుజీ ఉంటుంది. తరువాత సుజీతో పర్సనల్ గా మాట్లాడుతాడు అజాద్. మీ అమ్మాకోసం అబ్బాయిని వెతుకుతున్నావా అంటే నాన్నను వెతుకుతున్నా అని చెబుతుంది. దాంతో అజాద్ ఎమోషనల్ అవుతాడు. తరువాత తనను ప్రేమగా చూసుకునే నాన్నకోసం చూస్తున్నా అని చెబుతుంది. తరువాత సెల్ఫీ తీసుకుంటుంది. తరువాత సీన్లో నర్మద తన టీమ్ తో క్లూస్ గురించి మాట్లాడుతుంది. మెట్రోలో ఉన్నవారు ఎవరు తన గురించి చెప్పడానికి ఇష్టపడట్లేదు అని నర్మదతో ఇరాని చెప్తాడు. అక్కడున్న పోలీసు ఆచూకి లేదని మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో పోలీసు కొన్ని ఫైల్స్ తీసుకొని పేపర్స్ చించేస్తాడు. మరో సీన్లో అజాద్ కు సుజీ కాల్ చేస్తుంది. తను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిందని టీచర్ పేరెంట్స్ తీసుకురమ్మన్నదని మీరు నా ఫాదర్ గా రండి అని చెప్తుంది. కట్ చేస్తే అజాద్ స్కూల్ కు వెళ్లి సైన్ చేస్తాడు అక్కడికి నర్మద వస్తుంది. ఏంటి ఇదంతా అని అడుగుతుంది. సూజీ సంతోషంగా ఉందని తన కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్తుంది. తాను రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంట్లో మాట్లాడమంటే అబార్షన్ చేసుకో అన్నాడు దాంతో వాన్ని కట్ చేశా అని నర్మద చెప్తుంది. తాను కూడా నాన్న లేకుండానే పెరిగాను అని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదు అని చెప్తాడు. ఇక అజాద్ గురించి నిజం చెప్పాలని.. తాను ఏం చేస్తుంటాడో, ఎందుకు చేస్తుంటాడో చెప్పేలోపు సుజీ వస్తుంది. ఇక వాళ్లిందరికి ఇష్టమే అని మాట్లాడుకుంటారు. తరువాత సాంగ్ మొదలౌతుంది.
తరువాత సీన్లో ఆరోగ్యశాక మంత్రి కార్యక్రమంలో మాట్లాడుతుంటాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయి అని చెబుతాడు. కాని అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండవు. ప్రజలందరు చప్పట్లు కొడుతుంటారు. ఇప్పటికిప్పుడు తనను ఎవరన్నా కాల్చేసినా ప్రయివేట్ ఆసుపత్రికి కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రికే తీసుకువెళ్లాలి అని.. కాల్చుతారా.. కాల్చుతారా అని మైక్ లో అరుస్తుండగా.. అతన్ని అజాద్ మనిషి కాల్చేస్తుంది. తరువాత అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్తారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత అంబులెన్స్ లో మంత్రి ఉండడు. అజాద్ వేరే అంబులెన్స్ లో మంత్రిని కిడ్నాప్ చేస్తాడు. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్తారు. మంత్రిని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి కిడ్నాప్ చేసినట్లు చెప్తారు. మళ్లీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒక గవర్నమెంట్ హాస్పటల్ మినిస్టర్ ను బతికిస్తుందా.. అని విక్రమ్ రాథోడ్ గా పరిచయం చేసుకుంటూ లైవ్ పెట్టేస్తాడు. తరువాత నర్మద లైన్లోకి వస్తుంది. ఈ సారి ఎంత డబ్బు కావాలి అని అడుగుతుంది. నిజం కావాలి అని చెప్తాడు. మూడు సంవత్సరాల క్రిత ఒక అబద్దానికి నిజంగా మార్చి పూలమాలలు వేశారు.. ఇప్పుడున్న హెల్త్ సెక్రెటరీ అప్పుడు ఈ ఆసుపత్రికి డీన్ గా ఉండేవాడు అతన్ని మీడియా ముందుకు తీసుకురండి అని చెప్తాడు. నిజమెంటో చెప్పమనండి అంటాడు.
తరువాత కాళి హెల్త్ సెక్రెటరీకి ఫోన్ చేసి నిజం ఒప్పుకో అని చెప్తాడు. 3 సంవత్సరాల క్రితం శ్వాసకు సంబంధిచిన వ్యాధితో బాధ పడుతున్న 60 పిల్లలను ఆసుపత్రికి తీసుకొచ్చారు అని చెప్తాడు. వాళ్లకు సరిపడ ఆక్సిజన్ సిలిండర్స్ లేవని డీన్ కు ఫోన్ చేసి చెప్తుంది ఈరమ్.. డీన్ పట్టించుకోడు. దాంతో తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అమ్ము బ్యాగ్స్ తో ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయమని చెప్తుంది. ఈరమ్ ఆక్సీజన్ బ్యాంక్స్ కోసం వెళ్లి వాళ్ల కాళ్ల మీద పడి ఆక్సీజన్ తీసుకొని వస్తుంది. కాని ఆ లోపే 50 మంది పిల్లలు చనిపోతారు. ఈ నేరం మీరా మీద పడుతుంది. తనే తప్పు చేసిందని కోర్టు శిక్ష విధిస్తుంది. అందరు చెప్పులతో ఈరమ్ ను కొడుతారు. తన మెడికల్ లైసెన్స్ కూడా రద్దు అవుతుంది. ఈ విషయం మీడియాకు చెప్తాడు హెల్త్ సెక్రటరీ. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. నర్మద కూడా ఏడుస్తుంది. తరువాత నన్నేమి చేయమంటావ్ అని నర్మద అడుగుతుంది. మరో 5 గంటల్లో ప్రభుత్వ ఆసపత్రిలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని ఆర్డర్ వేస్తాడు. దాంతో ఆస్పటల్స్ అన్ని బాగా అవుతాయి. విక్రమ్ రాథోడ్ ఫోన్ చేసి వాళ్లకు హెలికాప్టర్ కావాలని చెప్తాడు. అప్పుడే వాల్లపైన నర్మద టీమ్ ఎటాక్ చేస్తుంది. ఫైట్ జరుగుతుంది. నర్మద, అజాద్ ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. అందరూ హెలికాప్టర్లో వెళ్తుంటే అజాద్ పెట్టుకున్న మాస్క్ ను లాక్కుంటుంది. వాళ్లు తప్పించుకుంటారు.
తరువాత సీన్లో తన మాస్క్ ను ల్యాబ్ లో చూపిస్తే అందులో ఉన్న వెంట్రుకలు ఒక్కరికి కావు అది విగ్గు అని చెప్తారు. తన దగ్గర ఉన్న డ్రాయింగ్ ను అన్ని వయసుల వారిలా స్కెచ్ గీయమని ఇరానితో చెప్తుంది. రేపు చూద్దాం అని అంటుంది. రేపు మీ పెళ్లి కదా అని వారు అంటారు.
నెక్ట్స్ సీన్లో కాళీ ఎక్సర్ సైజ్ చేస్తుంటాడు. ఇక తాను పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నారా అని తన తమ్ముడు అడుగుతాడు. ఓపిగ్గా ఉండూ అని ఒక కథ చెప్పి రష్యా వెళ్లి వస్తాను అని చెప్తాడు కాళి. తరువాత సీన్లో అజాద్ తో నర్యద పెళ్లి చేసుకుంటుంది. అదే సమయంలో స్కెచ్ గీస్తారు. అది అజాద్ బొమ్మ వస్తుంది. దాంతో ఇరాని ఫోన్ చేస్తాడు. సుజీ ఫోన్ కట్ చేస్తుంది. పెళ్లి జరుగుతుంది. తరువాత నర్మదతో అజాద్ అన్ని చెప్పుదాం అనుకుంటాడు. అంతలో నర్మద రొమాంటిక్ గా కిస్ చేయబోతుంది. అదే సమయంలో అజాద్ టీమ్ ఫోన్ చేస్తుంది. వాళ్లతో మాట్లాడుతుండగా.. నర్మదకు అజాద్ గురించి నిజం తెలిసిపోతుంది. తను చెప్పేలోపే భుజంపై షూట్ చేస్తుంది. జైల్లో ఉన్నవాల్లు అజాద్ కోసం వస్తు ఉంటారు. అదే సమయంలో కాళి తమ్ముడి గ్యాంగ్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే నర్మదను, అజాద్ ను ఓ గోడౌన్ లో కట్టేస్తారు. వీళ్లిద్దరు కావాలనే ఇదంతా చేస్తున్నారని విలన్లు మాట్లాడుకుంటారు. వాళ్లను కొడుతారు. గన్ తో నర్మదను కాలుస్తాడు. అదే సమయంలో అజాద్ గ్యాంగ్ వస్తుంది. విలన్ల మీద ఫైరింగ్ స్టార్ట్ చేసే లోపు డోర్ నుంచి వలన్లు గాల్లో ఎగురుతారు. విక్రమ్ రాథోడ్ ఎంట్రీ ఉంటుంది. అందరిని కొట్టి అజాద్ ను భుజం మీద ఏసుకొని వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో కాళి మీటింగ్ లో మాట్లాడుతుంటాడు. కొన్ని ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు జనాల నిరసనలతో వాటిని మూసేస్తారు. కాని ఇండియాలో అలాంటి ప్రాబ్లమ్ ఏది ఉండదు. ఎన్ని ఫ్యాక్టరీలు అయినా పెట్టుకోవచ్చు. కాని అక్కడ మన ప్రభుత్వమే ఉండాలి అలా ఉండాలంటే ఓట్లు కొనాలి.. ఓటుకు పదివేల చొప్పున కొంటే ప్రభుత్వం మనదే అని నేను 20 శాతం పెట్టుకుంటా ఇంకా 80 శాతం కావాలి అని చెప్తాడు. దానికి ఒక మాస్క్ మ్యాన్ మిస్టర్ డీ ఒప్పకుంటాడు. అంతలో కాళీకి ఫోన్ వస్తుంది. కట్ చేస్తే మార్చురీలో తన తమ్ముడిని చూసి బాధపడుతాడు. ఇదంతా చేసినోడు ఎక్కడుంటాడు అని ఆలోచిస్తాడు.
తరువాత సీన్లో నర్మద తన టీమ్ తో ప్లాన్ చేస్తుంది. అజాద్ జైలర్ గా ఉన్న జైలులో ఆరుగురు అమ్మాయిలు తనకు హెల్ప్ చేశారు అని వారిని కనిపెట్టాలంటే వారితో పాటే జైల్లో ఉండాలి అని ప్లాన్ చేస్తుంది. నాన్నను వెతికే అపరేషన్ లో ఉన్నానని, ఇరాని అంకుల్ చెప్పినట్లే వినాలి అని సుజీతో చెప్పి నర్మద తనకు తానే గాయం చేసుకొని బారెట్ 3 లో వెళ్లుతుంది. అక్కడ బ్లెడ్ కక్కుతుంది. వాటర్ ఇస్తే తీసుకోదు. నిన్నటి వరకు పోలీసు ఆఫీసర్ గా ఉన్న తాను అజాద్ వలనే ఇలా జైల్లో ఉన్నానని చెప్తుంది. అజాద్ గురించి తెలియాలంటే ముందు విక్రమ్ రాథోడ్, ఐశర్య గురించి తెలియాలి అని జైల్లో ఉన్న వాళ్లు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు.
కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అక్కడి వస్తాదుతో విక్రమ్ కుస్తీ పడుతాడు. తరువాత ఐశర్య చేయి ఎత్తుతుంది. ఇద్దరు కుస్తీ పడుతారు. సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ మధ్యలో ఒక అతను లెటర్ తీసుకొని వస్తాడు. కట్ చేస్తే బార్డర్ దగ్గర కొంతమంది కిడ్నాప్ చేశారు అని, వారికోసం వెళ్లిన టీమ్ కూడా చనిపోయింది అని ఛీఫ్ చెప్తాడు. మిగిలిన ఆరుగురి జవాన్లను తీసుకురావాలని అందుకోసమే మీ టీమ్ పనిచేయాలని చెప్తాడు. తరువాత మిషన్ లో తిగి అందరిని కాల్చేస్తుంటారు. అదే సమయంలో వారికి ఇచ్చిన గన్స్ పనిచేయవు. అదే విషయాన్ని విక్రమ్ తో చెబితే వాళ్ల గన్నులతోటే మిషన్ కంప్లీట్ చేయండి అని చెప్తాడు. తరువాత టెర్రరిస్ట్ లతో భీకరంగా ఫైట్ చేస్తారు. టీమ్ లో ఒక జవాన్ గ్రానైట్స్ తీసుకొని సెల్ఫ్ సాక్రీఫైస్ చేస్తాడు. మిషన్ సక్సెస్ అవుతుంది. కెప్టెన్ విక్రమ్ రథోడ్ కు మెడల్ ఇస్తారు. తరువాత మాట్లాడుతాడు. వాళ్ల చేతుల్లో ఉన్న వెపన్స్ పనిచేయలేదు అని, దీనిపై యాక్షన్ తీసుకోవాలని వాళ్లను కోరుతాడు. ఈ కంపెనీ ఎవరిది అని ఛీఫ్ అడిగితే.. కాళీ గైక్వాడ్ ది అని చెబుతాడు మరో ఆఫీసర్.
తరువాత సీన్లో కాళి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు సమన్లు వచ్చాయి అని చెప్తాడు అతని అసిస్టెంట్. దాంతో మీటింగ్ లో కూర్చుంటాడు. అసలు మన జవాన్లకు గన్ వాడడం రాదు అని అవమానిస్తాడు. చనిపోయిన జవాన్లకు నష్టపరిహారం ఇస్తా అని చెప్తాడు. ఆర్మీకి ముందు ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటాడు. దాంతో రాథోడ్ ఒక డెమో చూపిస్తా అని ఆ రోజు ఏం జరిగిందో అలానే చేస్తా అని గన్ తీసుకొని లోడ్ చేసి టార్గ్ ట్ ను గురిపెట్టి కాళిమీదకు గురిపెడుతారు. కాళి భయపడిపోతాడు. కాని గన్ పనిచేయదు. అంతలో తమషా చేస్తున్నావా అని మేజర్ అరుస్తాడు. తమషా నేను కాదు సర్ ఈ గన్ చేస్తుంది. అని మాట్లాడుతాడు. కాళితో డీల్ క్యాన్సిల్ చేస్తారు. దాంతో కాళి ఆలోచనలో పడుతాడు. తరువాత సీన్లో విక్రమ్ రాథోడ్ ఐశర్యతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లి లైట్స్ ఆఫ్ చేయగానే కుక్కపిల్లను చంపేస్తారు. నేను చూస్తాను అని బయటకు వస్తాడు రాథోడ్. కాళి తమ్ముడు విక్రమ్ కు ఇంజక్షన్ ఇస్తాడు. తరువాత కాళి తన వైఫ్ ను కొడుతాడు. విక్రమ్ ను తీసుకెళ్తారు. ఐశ్వర్య లేచి ఏడుస్తుంది. తరువాత మీ ఇంట్లో దొరికిన డబ్బే అని పోలీసులు ఐశ్వర్యతో మాట్లాడుతూ… నీ హస్బెండ్ దేశద్రోహీ అని ఓ సంతకం పెట్టమని బయపెడుతారు. సంతకం కోసం పెన్ తీసుకొని పోలీసును చంపేస్తుంది. గన్స్ తో కాల్చేస్తుంది. తరువాత అరెస్ట్ అవుతుంది. కట్ చేస్తే జైలులో ఉండగా.. విక్రమ్ వచ్చాడు అని చెబితే జైల్ వార్డ్ చెబితే ఐశర్య సంతోషంగా వెళ్తుంది. అక్కడ కాళి ఉంటాడు. విక్రమ్ ఎక్కడా అని అడుగుతుంది. పైనా అని వేలు చూపిస్తాడు.
హెలికాప్టర్ లో విక్రమ్ ను కొట్టి షూట్ చేసి బయటకు తన్నుతాడు. విక్రమ్ వెళ్లి సముద్రంలోపడుతాడు. ఇదే విషయాన్ని ఐశర్యకు చెప్తాడు. అక్కడినుంచి కాళి వెల్లిపోతాడు. తరువాత సీన్లో ఐశర్యకు ఉరిశిక్షను అమలు చేసే సమయంలో తాను ప్రెగ్నెంట్ అవుతుంది. లా ప్రకారం ప్రెగ్నెంట్ ఉమెన్ ను ఉరి తీయకూడదు, పుట్టిన బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చే వరకు శిక్ష వేయకూడదు అని జడ్జ్ తీర్పు చెప్తాడు. తరువాత తనను జైల్ లో అందరు చాలా బాగా చూసుకుంటారు. అక్కడే శ్రీమంతం కూడా చేస్తారు. తను విక్రమ్ కోసం కలలు కంటుంది. ఐశర్య మగ బిడ్డకు జన్మనిస్తుంది. జైల్ లో అందరూ సంతోషపడుతుంటారు. తన కొడుకును జైల్ లోనే పెంచుతుంది. అజాద్ బర్త్ డేను జైల్ లో జరుపుతుంది. పెద్దయ్యాక మీ నాన్న దేశద్రోహి కాదు అని నిరుపించాలని చెప్తుంది. తరువాత ఐశర్యను ఉరితీస్తారు. అజాద్ అమ్మా అనుకుంటూ ఏడ్చుకుంటూ వస్తాడు. వాళ్లమ్మను చూసి కిందపడిపోతాడు. జైలర్ కావేరి తనను పెంచింది అని లక్ష్మీ ఫ్లాష్ బ్యాక్ ను నర్మదకు చెప్తారు. అందరే కన్నీళ్లు పెట్టుకుంటారు. నర్మద కూడా ఎమోషనల్ అవుతుంది.
అజాద్ ఎక్కడున్నాడు అతన్ని కలవాలి అని అంటుంది. అతను సేఫ్ గానే ఉన్నాడని చెప్తారు. కట్ చేస్తే అజాద్ కు మెలుకువ వస్తుంది. నన్ను ఎవరు తీసుకొచ్చారు అని చూస్తే అక్కడ ట్రైన్ లో పోలీసు ఉంటాడు. మీ మొఖం చూసిన తరువాత నాకు మా ఊర్లో ఉన్న పెద్దాయన గుర్తుకు వచ్చాడని, నువ్వు చెప్పిన విక్రమ్ రాథోడ్ పేరుతో వెతకడం మొదలు పెట్టి ఆ టీమ్ లో ఉన్న అందరిని కనిపెట్టా అని చెప్తాడు. తరువాత విక్రమ్ గతం మరిచిపోయాడు అని చెప్తారు. ఇదంతా చేస్తుంది మీ కోసమే నాన్న అని అజాద్ చెప్తాడు. మీరు దేశద్రోహి కాదు అనేది దేశానికి చెప్పాలి అని అంటాడు. తరువాత విక్రమ్ ను హగ్ చేసుకుంటాడు. ఎమోషనల్ అవుతాడు.
తరువాత సీన్లో కాళీని ఇంటికి వెళ్దామని తన బాడీగార్డ్ చెప్తాడు. అదే సమయంలో మిస్టర్ డీ ఫోన్ చేస్తాడు. తనతో మాట్లాడుతాడు. నెక్స్ట్ సీన్లో నర్మదాను ఇంటారగేషన్ కోసం పిలుస్తారు. ఇదే విషయాన్ని అజాద్ కు చెప్తుంది లేడీ పోలీసు ఆఫీసర్. దాంతో వాళ్లు ఇంటరగేషన్ రూమ్ ను చూస్తారు. నర్మదను ఇంటరేగషన్ చేసే రూమ్ లో ఇరాని ఉంటాడు. నర్మదను కొడుతాడు. కాళికోసమే పని చేస్తున్నట్లు చెప్తాడు. అతనికి వీడియో కాల్ చేస్తాడు. నర్మదను, పాపను చంపేయమని చెప్తాడు కాళి. సుజీని కార్లో ఎక్కిస్తాడు ఇరాని. తరువాత సీన్లో విక్రమ్ పాప కోసం వెళ్తాడు. ఇరానితో అజాద్ ఫైట్ చేస్తాడు. జైలులో ఉన్న ఖైదీలు అందరు బయటకు వచ్చి ఇరానిని చంపేస్తారు. అదే సమయంలో నర్మద అజాద్ అని పిలుస్తుంది. వెల్లి చూస్తే లక్ష్మీని కత్తితో దాడి చేస్తారు. తనకు ఆపరేషన్ చేస్తారు. కాని తాను చనిపోతుంది. అదే స్థానంలో నర్మద జాయిన్ అవుతా అంటుంది.
తరువా సీన్లో కాళి డబ్బంతా కంటేనర్‌లో తీసుకుపోతున్నాడని, అవి సీటీ దాటితే వాడు అనుకున్నదే జరుగుతుంది అని అజాద్ ప్లాన్ చెప్తుంటాడు. అయితే కంటేనర్స్ ని విక్రమ్, అజాద్ కబ్జా చేద్దామని ప్లాన్ చేస్తారు. తరువాత సీన్లో కాళి తన తమ్ముడికి చితిపెడుతుంటాడు. మురాద్ అని అరుస్తాడు. కంటైనర్ల మీద దూకుతారు. గన్ మిస్ అయి కారుకు చిక్కుతుంది. దాంతో ఫైట్ జరుగుతుంది. అక్కడికి విక్రమ్ బైక్ పై వస్తాడు. ఆర్మీ జవాన్లు కూడా బైకుల మీద వస్తారు. కారుపై గుడ్డు కొడుతారు. కారుకు వైర్ కట్టి పోల్ కు చుడుతాడు. కారుపై క్లాత్ వేస్తారు. అలా ఛేసింగ్ తరువాత ఇంకొంత మంది వస్తారు. వారికి విక్రమ్ దొరికిపోతాడు. మరో సీన్లో అజాద్ తలకు క్లాత్ చుట్టుకుంటూ ఉంటాడు. తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ అండ్ టీమ్ ను కాళి బందిస్తాడు. వాళ్లను గోల్ఫ్ బాల్స్ తో కొడుతుంటాడు. అంతలో టీవీలో న్యూస్ వస్తుందని అసిస్టెంట్ చేప్తే టీవీ చూస్తాడు. కాళీ కన్ఫ్యూస్ అవుతాడు. విక్రమ్ లైవ్ లోకి వచ్చాడు అని ప్రజలందరు చూస్తుంటారు. రెండు చోట్ల ఎలా అని కాళి అడుగుతాడు. అతను డూప్ హా, వరిజినల్ గా అని గడ్డం పీకి చూస్తాడు. జరిగింది తనుకు గుర్తుకు లేదని జావాన్స్ చెప్తాడు. తరువాత కాళి దగ్గర అసిస్టెంట్ ఆరోజు తమ్ముడిని చంపింది ఇతనే అని మూగ సైగ చేస్తుంటాడు. అతని దగ్గర టాబ్లెట్ తీసుకొని అతన్ని చంపేస్తాడు. డ్రామాలు చేయొద్దు రాథోడ్ నేను ఎవరో తెలియాదా అని అడుగుతుంటాడు కాళి. దానికి శాంటక్లాజ్ అని అంటాడు. అందరూ నవ్వుతారు.
తరువాత ఆజాద్ తో నెగోషియేట్ చేయడానికి మధవన్ నాయక్ వస్తాడు. వంద మందిని లోపలి పంపి అందరిని షూట్ చేయమంటాడు. వాళ్లు అందరు లోపలికి వెళ్తారు. ఇక పని ఐపోయింది అని ఇంటికి వెళ్తున్నట్లు స్కూటర్ స్టార్ట్ చేస్తాడు. అంతలో ఒక ఆఫీసర్ బాక్సర్ మీద బయటకు వస్తాడు. లోపల ఉన్నది 6 మంది అమ్మాయిలు కాదు సర్ 6 వేల మంది, ఒక సైన్యమే ఉందని చెప్తాడు. ఇక జైల్ బయట ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్తాడు. మాధవన్ రాళ్లు విసురుతాడు. మైన్స్ పేళుతాయి. మాధవన్ అజాద్ కు కాల్ చేస్తాడు. గవర్నర్ సంతకం కావాలని అడుగుతాడు అజాద్. దానికి గవర్నమెంట్ ఒప్పుకోదు అని మాధవన్ చెప్తాడు. నా దగ్గర ఒకటి ఉంది అది చూపిస్తే ఒప్పుకుంటుంది అని చెప్తాడు. సుజీ రెండు బాక్స్ లను తీసుకొస్తుంది. అవి ఏవీఎమ్ బాక్స్ లు. వాటిని నర్మద తన టీమ్ తో కాజేస్తారు. ఆఫీసర్ కు గన్ పెట్టి వాటిని తీసుకోస్తారు. ఈవీఎం మిషన్స్ కనపడకపోతే రాష్ట్రమంతా ఆగం అవుతుంది అని మాట్లాడుకుంటారు.
తరువాత మీటింగులో వాళ్లు చెప్పింది ఒప్పుకుందామా లేదా అని గవర్నర్ అడుగుతాడు. దాంతో గవర్నర్… బెదిరించి మరి మంచి చేస్తున్నాడు అని సైన్ పెట్టి… అన్ని విషాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలను మూసీ వేస్తారు. తరువాత సీన్లో మిస్టర్ డీ ఫోన్ చేసి కాళిని తిడుతాడు. అదేకోపంతో విక్రమ్ ఫ్రెండ్స్ ను జైల్ లోకి వెళ్లెందుకు ఇంకో దారి ఏంటని అడుగుతూ చిత్రహింసలు పెడుతాడు. తరువాత సీన్లో మరో డిమాండ్ ఉందని అది ప్రజల కోసమని చెప్తాడు. తాను విక్రమ్ రాథోడ్ కాదు అజాద్ అని చెప్తాడు. మీకు ఓటు హక్కు ఉంది అమ్ముకోవడానికి కాదు ఎన్నుకోవడానికి అని చెప్తాడు. చిన్న వస్తువులనే మనం బేరం ఆడి కొంటాము అలాంటిది నాయకుడిని ఎన్నుకునే ముందు ఒక్క ప్రశ్న కూడా అడగము అని మాట్లాడుతుంటాడు. భయం, డబ్బులు, జాతి, మతం చూడకుండా.. ఓటు వేయకముందే నాయకుడిని నిలదీయండి అని చెప్తాడు. మీరు కరెక్ట్ గా ఉంటే నాలాంటి వాళ్ల అవసరం లేదని చెప్తాడు. మీరు వేలు ఎత్తి ప్రశ్నించండి అని చెప్తాడు. తరువాత ఈవీఎమ్ మిషన్లను బయటకు పంపిస్తాడు.
కట్ చేస్తే అక్కడికి కాళి తన మనుషులతో, విక్రమ్ రాథోడ్ ను తీసుకొని వస్తాడు. అందరిని జైల్లో వేసి ఆజాద్ ను కొడుతాడు కాళి. అజాద్ నవ్వుతాడు. తరువాత విక్రమ్ ను కొడుతాడు. అజాద్ వద్దు అంటాడు. అప్పుడు నీ బాబును చంపడం చూడలేదు కదా ఇప్పుడు చూడు అని గన్ తో ట్రిగ్గర్ చేస్తాడు. అది పేలదు. కథ ఇక్కడే మొదలైంది మళ్లీ ఇక్కడికే వచ్చింది అని గన్ తో కాల్చుతాడు. అది ఎంతకు పేలదు ఆ సౌండ్ కు విక్రమ్ కు గతం గుర్తుకు వస్తుంది. దాంతో కాళి, అజాద్ నవ్వుతారు. విక్రమ్ కు గతం గుర్తుకువస్తుంది. అజాద్ ను కొడుతుంటే విక్రమ్ తాళం పట్టుకుంటాడు. నా కొడుకు మీద చేయి వేసే ముందు వాడి బాబుతో మాట్లాడు అని కాళి గాల్లో లేపి ఒక పంచ్ ఇస్తాడు. తరువాత అజాద్ ను దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఈవీఎమ్ మిషన్లు బయటకు వెళ్తాయి. కాళిని విక్రమ్ కొడుతూనే ఉంటాడు. అదే సమయంలో కాళి బాడీ గార్డ్ వస్తాడు. అతను బాహుబలిలా హైట్ ఉంటాడు. కాసేపు తండ్రీకొడుకులను ఇద్దరిని కొడుతాడు. ఇక ఇద్దరు కలిసి వాన్ని అంతం చేస్తారు. సుజీ నవ్వుతుంది. తరువాత కాళిని ఉరి తీసే చోటుకు తీసుకెళ్తారు. తనకు ఉరి వేసి పోస్తారు. ఐశర్యకు చెప్పిన మాటలు అవే మాటలు గుర్తుకు వస్తాయి కాళికి. డీల్ చేసుకుందాం అని కాళి అంటుండగా.. నో డీల్ అంటాడు విక్రమ్.. గర్ల్స్ ఉరితీస్తారు.
తరువాత సీన్లో మాధవన్ నాయక్ ను ఆఫీసర్ తిడుతుంది. అజాద్ హాయిగా రెస్టారెంట్ పెట్టుకుంటాడు. అక్కడికి మాధవన్ వస్తాడు. గన్ పెడుతాడు. కట్ చేస్తే వారి ఇద్దరు ఒకటే.. మొదటి ఆఫరేషన్ నుంచి కలిసే పనిచేస్తారు. తరువాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. నెక్ట్స్ మిషన్ స్విస్ బ్యాంక్ అని చెప్తాడు. తరువాత ప్రజలందరికి డబ్బులు పంచుతారు. వెళ్లి విక్రమ్ ను లేపి.. ఇంకో మిషన్ వచ్చింది చెప్తాడు ఆజాద్. రెస్ట్ ఇవ్వరా ఎప్పుడు పనేనా అని మ్యూజిక్ అంటాడు విక్రమ్. రామయ్య.. అనే ఎండింగ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇది జవాన్ మూవీ కథ.