»Kalki 2898ad A New Record In Kalki Bookings And What Is The Budget Remuneration Break Even Target
Kalki 2898AD: ‘కల్కి’ బుకింగ్స్‌లో కొత్త రికార్డ్.. మరి బడ్జెట్, పారితోషికం, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ పై భారీ అంచనాలున్నాయి. జూన్ 27న థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి.
Kalki 2898AD: A new record in 'Kalki' bookings.. And what is the budget, remuneration, break even target?
Kalki 2898AD: చెప్పాలంటే.. కల్కికి మరో సినిమా పోటీ లేనే లేదు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కిని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి థియేటర్లో కల్కి చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. అయినా కూడా కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఒక్క హైదరబాద్ జోన్ పరిధిలో మొదటి రోజు 6 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అది కూడా రిలీజ్‌కు మూడు రోజుల ముందే. ఇక రిలీజ్ వరకు ఈ కౌంట్ ఇంకెంత పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. నార్త్ అమెరికాలో రికార్డ్ రేంజ్ ప్రీసేల్స్ జరుగుతున్నాయి.
ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే కల్కికి 20 కోట్లకు పైగా వచ్చేశాయని అంటున్నారు. అంతే కాదు.. డంకీ, సలార్ లాంటి సినిమాల రికార్డులు కూడా తిరగరాసిందని చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొలి రోజు అన్ని షోలు దాదాపు ఫుల్ అయ్యాయి. దీంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమాను దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తీశారు. రిలీజ్ వరకు మరో వంద కోట్లు పెరిగినట్టుగా టాక్ ఉంది. ఇందులో ఒక్క ప్రభాస్‌కే 150 కోట్ల పారితోషికం అందినట్టుగా తెలుస్తోంది. అంటే సినిమా బడ్జెట్లో 25 శాతం అన్న మాట. ఇక అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ తలో 18 నుంచి 20 కోట్లు తీసుకున్నారని సమాచారం.
దీపిక పదుకొనే 10 కోట్లు, దిశా పటాని 5 కోట్ల పారితోషికం తీసుకుందట. మిగతా ఆర్టిస్టులందరికీ కలిపి 60 కోట్ల మేర రెమ్యూనరేషన్లు ఇచ్చినట్టుగా సమాచారం. మొత్తంగా సినిమా బడ్జెట్లో 250 కోట్ల వరకు పారితోషికానికే పోయినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 400 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్‌తో బరిలోకి దిగబోతున్నట్టుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే 180 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. ఈ లెక్కన తెలుగులోనే కల్కి 200 కోట్లకు అటు ఇటు షేర్, 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
ఇక ఓవర్సీస్లో 100 కోట్లు, హిందీలో 100 కోట్లు, మొత్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకొని 385 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. అంటే 400 కోట్ల వరకు షేర్, 800 కోట్ల వరకు గ్రాస్ వస్తే గానీ అన్ని ఏరియాల్లో కల్కి బ్రేక్ ఈవెన్ కాదన్నమాట. ఇక థియేట్రికల్ బిజినెస్ 400 కోట్లు అంటే, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అంతే మొత్తంలో జరిగినట్టుగా చెబుతున్నారు. కాబట్టి.. ఎంత కాదనుకున్న కల్కి మొత్తం బిజినెస్ 700 కోట్లకు పైగానే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మూవీ మేకర్స్ సేఫ్ అయినట్టే. కానీ సినిమా టాక్ పైనే డిస్ట్రిబ్యూటర్స్ లెక్క డిపెండ్ అయి ఉంటుంది. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.