NRPT: ఊట్కూరు మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం పక్కన లక్షలు వెచ్చించి నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నీటి కనెక్షన్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణ లక్ష్యంతో నిర్మించినప్పటికీ వినియోగంలోకి రాలేదు. నీరు అందించేందుకు రూ. 10 లక్షలు వెచ్చించి 2 కిలోమీటర్ల దూరం నుండి పైపులు వేసి వదిలేశారు.