WG: మొగల్తూరు మండలంలోని శేరేపాలెంలో మంగళవారం నిర్వహించిన ‘మన భూమి-మన పట్టా’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన భూమి-మన పట్టా’ కార్యక్రమం ద్వారా భూ యజమానుల హక్కులు స్పష్టంగా నమోదు కావడం వల్ల రైతులకు భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నారు.