ATP: తాడిపత్రిలో జేసీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో అవసరమని సూచించారు. నియోజకవర్గ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.