ADB: బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి మంగళవారం యాదవ సంఘం సభ్యులతో కలిసి కనుగుట్ట సర్పంచ్ అనిత రాజేందర్ భూమి పూజ చేశారు. త్వరలో మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.