విజయనగరం జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. జామి మండలం ఎం.కొత్తవలస గ్రామంలో తుప్పల్లో గుడ్డలు చుట్టిన పసికందు మృతదేహం బయటపడింది. బొడ్డు పేగుతోనే శిశువు పడి ఉండటంతో స్థానికులు చలించిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.