విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో హిమాచల్‌ప్రదేశ్ తలపడుతోంది. పొగమంచు కారణంగా ఆటను 33 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 33 ఓవర్లలో 299/9 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (82) అదరగొట్టాడు. గతేడాది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే.