జనగామ మున్సిపాలిటీ కోర్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న ZP బాలికల పాఠశాల భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, భద్రత, తాగునీరు, శానిటేషన్ వంటి వసతులను సమీక్షించారు. గడువులోపు నాణ్యతతో కూడిన అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు తదితరులున్నారు.